నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానాన్ని తెరాస కైవసం చేసుకుంది. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ల వారి ఓట్ల వివరాలను పల్లాకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అందజేసి అభినందించారు. ఇవాళ ఈసీ నుంచి ధ్రువపత్రం రాగానే పల్లాకు పాలనాధికారి అందజేయనున్నారు.
స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,806 ఓట్ల మెజారిటీతో పల్లా గెలుపొందారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా... తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి.
సీఎం హర్షం...
ఎమ్మెల్సీగా పల్లా గెలుపు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించిన సీఎం... పల్లాను గెలిపించిన పట్టభద్రులు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో వాణీదేవికి పట్టం