ETV Bharat / state

మంచానికే పరిమితమైన భర్త... పిల్లల భవిష్యత్​పై భార్య ఆవేదన - తెలంగాణ వార్తలు

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. భార్యాభర్తలిద్దరూ పని చేస్తేనే కుటుంబం గడిచేది. వారికి ఇద్దరు పిల్లలు. చెరో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ సంతోషంగా జీవిస్తున్న వేళ అనుకోని సమస్య వచ్చింది. ఆ ఇంటి పెద్ద కిడ్నీలు పాడై మంచానికే పరిమితమయ్యారు. ఇక వారి జీవితంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.

the-husband-loses-his-legs-and-wife-working-as-labour-but-they-seeking-donors-help-at-miryalaguda-in-nalgonda-district
మంచానికే పరిమితమైన భర్త... పిల్లల చదువు ఆగిపోతుందని భార్య ఆవేదన!
author img

By

Published : Feb 28, 2021, 7:17 PM IST

భార్య భర్తలిద్దరూ కూలీ పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ సంతోషంగా గడుపుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కారు చీకట్లు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద మంచానికే పరిమితమవడం వల్ల వారి జీవితం ఛిన్నాభిన్నమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్​కు చెందిన రేగూరి శేఖర్ ఓ గ్యాస్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. గతేడాది కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరగా... వైద్యులు డయాలసిస్ చేశారు. డయాలసిస్ వల్ల ఆయన ఒక చేయి, కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యారు.

చికిత్స కోసం ఇప్పటికే రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశామని ఆయన భార్య సైదమ్మ తెలిపారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద మంచాన పడడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని ఆమె వాపోయారు. కూలీ చేస్తూ వారిని పోషిస్తున్నట్లు తెలిపారు. పిల్లల చదువులు ఆగిపోతాయనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా దాతలు, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

మంచానికే పరిమితమైన భర్త... పిల్లల చదువు ఆగిపోతుందని భార్య ఆవేదన!

ఇదీ చదవండి: ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.