రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో బత్తాయిని సాగు చేసే నల్గొండ జిల్లాలో రైతులు అధిక ఆదాయం కోసం కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉన్న బత్తాయిల(Mosambi)ను ఇక్కడి రైతులు హైదరాబాద్, దిల్లీ, ముంబయి మార్కెట్లకు ఎగుమతి చేస్తుంటారు. వీటికి మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు.
ఇవీ చదవండి :
- Crop Insurance : పంట బీమా అమల్లో ఉన్నా.. అన్నదాతలకు అన్యాయం
- successful farmer: 'నాది సేంద్రియ పంట.. నేను చెప్పిందే ధర'
ఈ క్రమంలోనే ఎక్కువ ఆదాయం పొందడానికి వేములపల్లి మండలం మొలకపట్నానికి చెందిన రైతు నామిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన 12 ఎకరాల బత్తాయి(Mosambi) తోటలో చెట్టుకున్న ప్రతి కాయ చుట్టూ తాటి కమ్మలతో చేసిన బుట్టను అల్లుతున్నారు. దీంతో కాయ కార్బైడ్ అవసరం లేకుండానే పక్వానికి వచ్చి పసుపు రంగులోకి మారుతుంది. చీడ, పీడల బాధా తప్పుతుంది. కాయను కోసే 45 రోజుల నుంచి 60 రోజుల ముందు ఇలా ప్రతి కాయ చుట్టూ బుట్టలతో అల్లుతారు.
ఇవీ చదవండి :
ఇలా చేయడం వల్ల ఆకుపచ్చ, పసుపు రంగులోకి మారిన బత్తాయిల(Mosambi)కు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో బాగా డిమాండ్ ఉంటోంది. దీంతో అక్కడి వ్యాపారులు తోటలకు వచ్చి మరీ అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం బత్తాయిల ధర టన్నుకు 15 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుండగా ఈ బుట్ట రకం బత్తాయిలకు రెట్టింపు ధర (టన్ను సుమారు 40-42 వేల వరకు) పలుకుతోంది.
- ఇదీ చదవండి : Agriculture: మూడేళ్లలో 38% పెరిగిన పంటల సాగు వ్యయం
- ఇదీ చదవండి : ఆ మామిడి పండ్లు తినాలంటే ఆస్తులమ్ముకోవాలి!