ETV Bharat / state

మునుగోడులో కాంగ్రెస్‌కు మునుపటి వైభవం వచ్చేనా?

TCongress: కాంగ్రెస్‌ కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటంతో.. ఆ పార్టీ నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మునుగోడులో క్యాడర్‌ చేజారిపోకుండా చర్యలు చేపట్టిన పార్టీ నాయకత్వం.. ఈరోజు నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మునుగోడులో మరోసారి కాంగ్రెస్‌ జెండాను ఎగరేయటమే లక్ష్యంగా హస్తం నేతలు పావులు కదుపుతున్నారు.

కాంగ్రెస్‌
కాంగ్రెస్‌
author img

By

Published : Aug 5, 2022, 5:37 PM IST

TCongress: కాంగ్రెస్‌ కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటంతో.. ఆ పార్టీ నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి ..గత కొన్నేళ్లుగా ప్రత్యర్థి భాజపాను పొగుడుతూ సొంత పార్టీపై విమర్శలు చేయటంపై హస్తం పార్టీ వేచి చూసే ధోరణి ప్రదర్శంచింది. మూడ్రోజుల క్రితం కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించటంతో.. పార్టీ నాయకత్వం వెంటనే రంగంలోకి దిగింది.

ఇందులో భాగంగానే ఓ వైపు రాజగోపాల్‌పై విమర్శల బాణం ఎక్కుపెడుతూనే.. మరోవైపు పార్టీకి పెట్టనికోటలాంటి ఉమ్మడి నల్గొండలో ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మునుగోడులో క్యాడర్‌ చేజారిపోకుండా చర్యలు చేపట్టిన పార్టీ నాయకత్వం.. ఇవాళ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు ఉత్తమ్‌, జానారెడ్డి, మధుయాస్కీ, తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, స్థానిక ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు అంశం తొలి నుంచి చర్చనీయంగా మారగా.. ఫైనాన్స్ కమిటీ సమావేశం దృష్ట్యా హాజరుకాలేకపోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్‌తో పాటు భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాలకు చెందిన ముఖ్య నేతలు, స్థానిక నాయకులు పాల్గొననున్నారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలే పునాదులుగా హస్తం నేతలు భావిస్తున్నారు. వారిని కాపాడుకుంటూ మునుగోడులో ఉపఎన్నిక వస్తే మునుపటి తీరుగానే ప్రత్యర్థులను చిత్తు చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారు.

ఇవీ చదవండి : MP komatireddy venkat reddy: 'పార్టీ మారతానని ప్రచారం చేస్తే లీగల్‌ నోటీసులు ఇస్తా'

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.