ETV Bharat / state

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు - trs ministres sagar election campaigning

సాగర్ ఉప ఎన్నికల నామినేషన్లు ఘట్టం ముగియటంతో తెరాస నాయకులు ప్రచారం ప్రారంభించారు. మంత్రులు జగదీశ్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస అభ్యర్థి నోముల భగత్​తో కలసి ప్రచారం నిర్వహించారు.

trs election campaigning
సాగర్ ఉప ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 31, 2021, 12:28 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి నామినేషన్లు ఘట్టం నిన్నటితో ముగియడంతో తెరాస పార్టీ నాయకులు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మాడుగుల పల్లి మండలం అబంగాపురంలో ప్రచారంలో పాల్గొన్న మంత్రులు జగదీశ్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్.. పార్టీ అభ్యర్థి నోముల భగత్​తో కలసి ప్రచారం చేశారు.

మొదటగా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో మాజీ ఎమ్మెల్యే రాంమూర్తి యాదవ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. గతంలో ఈ ఊరు త్రిపురారం మండలంలో ఉండగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జానారెడ్డి కూడా ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభించేవారు. ఇప్పుడు కొత్త మండలాలు వచ్చిన తర్వాత అబంగాపురం మాడుగుల పల్లిలోకి వెళ్లడం.. ఓట్లు మాత్రం సాగర్ నియోజకవర్గంలో ఉండటం వల్ల అదే ఆనవాయితీని కొనసాగిస్తూ నోముల భగత్ ప్రచారం ప్రారంభించారు. తెరాస అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రులు కోరారు.

ఇదీ చదవండి: ఇక హెచ్చరికలు లేవు.. మాస్కు లేకుంటే రూ.వెయ్యి కట్టాల్సిందే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.