ETV Bharat / state

నల్గొండ జిల్లా వాసికి అరుదైన గౌరవం.. పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం.. - rare honor for young man

నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన విష్ణు అనే యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విష్ణు తన ప్రతిభను చాటాడు.

yuvakudiki_arudina_gowravam_
yuvakudiki_arudina_gowravam_
author img

By

Published : Oct 28, 2022, 4:30 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ నియోజకవర్గం హాలియా పట్టణానికి చెందిన విష్ణు అనే యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విష్ణు తన ప్రతిభను చాటాడు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల వారు పాల్గొనగా.. 8 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. అందులో తెలంగాణ నుంచి విష్ణు ఎంపికయ్యాడు. ఎంపికైన వారికి నెహ్రూ కేంద్ర సంఘటన్ కో ఆర్డినేటర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ నెల 31న సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత పార్లమెంట్​లో ఉపన్యాస పోటీల్లో వీళ్లు ప్రసంగించనున్నారు. ఈ అవకాశం తెలంగాణ నుంచి విష్ణుకు దక్కినందుకు అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు తల్లిదండ్రులు గోపినాయర్, ప్రియా నాయర్​లు కేరళ నుంచి హాలియాకు 24 ఏళ్ల కిందట వచ్చి ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. విష్ణు నల్గొండలో డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.