ETV Bharat / state

Telangana Police Seized RS 3 Crores in Nalgonda : ఎన్నికల ఎఫెక్ట్​.. వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద రూ.3 కోట్లు సీజ్.. మరో చోట రూ.6 లక్షలు - తెలంగాణ ఎన్నికలపై ఈసీ ఫోకస్​

Telangana Police Seized RS 3 Crores in Nalgonda Today : శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా గస్తీని నిర్వహించి.. కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. నల్గొండ, కుమురం భీం జిల్లాల్లో రూ.3.6 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana Police Seized RS 3 Crores
Telangana Police Seized RS 3 Crores Money
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 11:59 AM IST

Telangana Police Seized RS 3 Crore Cash in Nalgonda Today : శాసనసభ ఎన్నిక నేపథ్యం(Telangana Assembly Election)లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్​ అమలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో సొత్తు లభ్యమైంది. నగదుతో పాటు మద్యం, ఓటర్లను ఆకర్షించడానికి పంపిణీ చేసే సామగ్రి పోలీసుల తనిఖీ(Police Checks at Assembly Election)ల్లో లభించాయి. తాజాగా నల్గొండ జిల్లా, కుమురంభీం జిల్లా చెక్​ పోస్టు​ల వద్ద పోలీసులు నిర్వహించిన.. సోదాల్లో రూ.3.6 కోట్ల భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

3 Crores Seized in Nalgonda Today : తెలంగాణ రాష్టంలో ఎన్నికల కోడ్(Election Code in Telangana) అమల్లో ఉన్నందున నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న భారీ మొత్తంలో నగదును పోలీసులు పట్టుకున్నారు. ఆ నగదు మొత్తాన్ని వాడపల్లి పోలీస్​ స్టేషన్​లో అధికారులు లెక్కించగా.. వాటి విలువ సుమారు రూ. 3కోట్లుగా ఉండవచ్చని తేలింది. సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు ఆ డబ్బు మొత్తాన్ని సీజ్​ చేశారు. హైదరాబాద్​ నుంచి చెన్నైకు నగదును తరలిస్తున్నట్లు తెలిపారు.

Police Seize Huge Amount of Gold and Money : రాష్ట్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 37 కోట్లకు పైగా జప్తు

Police Seized Six Lakhs Komaram Bheem : కుమురం భీం జిల్లా కాగజ్​ నగర్​ పట్టణంలో శనివారం రాత్రి.. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్​నగర్​ పట్టణంలోని వినయ్​ గార్డెన్​ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా రూ.6.9 లక్షలు నగదు పట్టుబడింది. ఈ నగదుకు సంబంధించి సదరు వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో.. పోలీసులు ఎన్నికల వ్యయ పరిశీలన కమిటీకి అప్పగించారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు సమర్పిస్తే పరిశీలించి.. ఆ నగదును తిరిగి పొందవచ్చని అధికారులు ఆ వ్యక్తికి చెప్పారు.

Police Seized Huge Amount of Money and Gold : రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.75 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు నగదు రూ.48.32 కోట్ల దొరకగా.. రూ.17.50 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు ఆభరణాలను పట్టుకున్నారు. ఆ రూ.75 కోట్ల నగదులో శుక్రవారం ఒక్కరోజే 21 కోట్ల పైగా పట్టుబడింది. దీనిలో రూ.15.51 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకొంది. ఇంకా లక్షా 33 వేల లీటర్లకు పైగా మద్యం.. దీని విలువ రూ.4 కోట్లకు పైమాటే. అలాగే రూ.2.48 కోట్లకు పైగా విలువ చేసే మాదకద్రవ్యాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.1.90 కోట్లు విలువ చేసే కుట్టు మిషన్లు, కుక్కర్లు, బియ్యం, చీరలు, హెల్మెట్లు, గడియారాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Police Impose Election Code Strictly in Telangana : పోలీసుల విస్తృత సోదాలు.. భారీగా పట్టుబడుతున్న అక్రమ నగదు, బంగారు ఆభరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.