ETV Bharat / state

‍Nagarjuna sagar chakaligattu : కృష్ణమ్మ ఒడిలో...అందాల ద్వీపం

‍Nagarjuna sagar chakaligattu : ఐలాండ్స్‌ అంటే వెంటనే గుర్తుకు వచ్చే ప్రదేశం మాల్దీవులు. ఒక్కసారైనా అక్కడికి వెళ్లి సేదతీరాలని పర్యాటక ప్రియులు కలలు కంటుంటారు. లక్షలు ఖర్చు పెట్టి ఆనందాన్ని కొనుక్కుంటారు. ఇలాంటి పర్యాటకులకోసం తెలంగాణ ప్రభుత్వం నల్గోండలోని కృష్ణా నది మధ్యలో ఉన్న ద్వీపాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో జనాల్ని ఆకర్షిస్తున్న ఈ ప్రదేశం.. మౌలిక వసతుల కల్పన తర్వాత దేశ విదేశీ పర్యాటకులని తీసుకువస్తుందని భావిస్తున్నారు.

‍Nagarjuna sagar chakaligattu
కృష్ణమ్మ ఒడిలో...అందాల ద్వీపం
author img

By

Published : Mar 5, 2022, 5:28 PM IST

కృష్ణమ్మ ఒడిలో...అందాల ద్వీపం

Nagarjuna sagar chakaligattu : నాగార్జునకొండ వద్దనున్న బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ట్రెక్కింగ్, రోప్ వే, బోటింగ్ లాంటి సాహస క్రీడలను త్వరలోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విదేశీ బౌద్ధులు... నాగార్జునకొండను దర్శించుకుంటారని... అలాగే పక్కనే ఉన్న ఈ ద్వీపాన్ని కూడా పర్యటించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే బుద్ధవనం ప్రారంభానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా.... అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టూ కృష్ణాజలాలు... మధ్యలో అందమైన ద్వీపం ఉన్న ప్రాంతమిది. సాగర్ నుంచి బోటులో... నాగార్జునకొండకు వెళ్లేదారిలో ఈ ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. దాదాపు 407 ఎకరాలు విస్తరించిన ఈ ప్రాంతాన్ని స్థానికులు చాకలిగట్టుగా పిలుస్తుంటారు.

ఆకర్షిస్తున్న ఐలాండ్

చరిత్ర ప్రసిద్ది గాంచిన మానవనిర్మత సాగరం ఒకవైపు.... బౌద్ధగురువు నాగార్జునుడు నడయాడిన ప్రాంతం మరోవైపు.... కృష్ణాజలాలు మధ్యలో ఆ ద్వీపం. సాగర్‌ నుంచి బోటులో నాగార్జునకొండకు వెళ్లేదారిలో ఇది కనిపిస్తుంది. మధ్య, కొత్త రాతి యుగాల్లో ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలూ వెలుగు చూశాయి. దీనినే స్థానికులు చాకలిగట్టుగా పిలుస్తుంటారు. దీని విస్తరణ 407 ఎకరాలు ఉంటుంది. సెలవు రోజుల్లో స్థానికుల విహార చోటు ఇదే. గత కొంతకాలంగా రాష్ట్రంలోని పర్యాటకప్రియిలను ఆకర్షిస్తోంది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని తాజాగా ఆదేశాలు జారి చేసింది.

పర్యాటకులన్ని ఆకర్షించేందుకు చర్యలు

అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న బుద్ధవనం ప్రాజెక్టుకు సమీపంలో సాగర్‌ బోటింగ్‌ పాయింట్‌ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సాగర్‌ ప్రాజెక్టు మధ్యలో ఉంటుందీ ద్వీపం. ఇటీవల పర్యాటక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యటించి అభివృద్ధికి గల మార్గాలతో ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ ద్వీపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల్ని ఆకర్షించవచ్చని ప్రభుత్వ భావన. అంతేకాకుండా ప్రకృతి, సాహస పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గానూ ఇక్కడ ట్రెక్కింగ్, రోప్‌వే, బోటింగ్‌ తదితర సదుపాయాలను త్వరలోనే కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉండటంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోగానే క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు రాత్రి బస చేయడానికి వసతి, ట్రెక్కింగ్‌ తదితర సదుపాయాలను కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. అలా చేస్తే మరింత మంది పర్యాటకులను ఆకర్షించవచ్చనేది అధికారుల ఉద్దేశం. విదేశాల నుంచి అధికంగా వచ్చే బౌద్ధులు నాగార్జునకొండను దర్శించుకుంటారని దీంతో పాటూ పక్కనే ఉన్న ఈ ద్వీపాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బుద్ధవనం ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా ఈ ద్వీపంలో పర్యటించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.

ఉపాధి అవకాశాలు లభిస్తాయి

చాకలిగట్టుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలి. గతంలోనే ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. రోప్‌వే కూడా ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి.

- రమేశ్, కౌన్సిలర్, నందికొండ పురపాలక సంఘం

సినిమా షూటింగ్‌లు చేయాలి

నాగార్జునసాగర్‌లో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. చాకలిగట్టు, ఏళేశ్వరం, నందికొండ లాంటి పురాతనప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లు చేయాలి. అప్పుడే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.

-వీరయ్య, నందికొండ

వసతి సదుపాయాలు కల్పిస్తేనే అభివృద్ధి :

ఇది ఒక త్రివేణి సంగమం. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న గొప్ప కేంద్రం. నది మధ్యలో ఉన్న చాకలిగట్టుకు వెళ్లే దారిలో లాంచి స్టేషన్‌నుంచి ప్రయాణ మార్గంలో ఎన్నో ప్రకృతి అందాలు తిలకించవచ్చు. అటవీ శాఖ సైతం ఇక్కడ వన్యప్రాణ సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది. పర్యాటకులకు వసతి సదుపాయాలు కల్పిస్తే గొప్పగా అభివృద్ధి చెందుతుంది.

-కే వెంకటేశ్వర్లు, నందికొండ

ఇదీ చదవండి: NO MGNREGA For Chenchu Community : అడవిబిడ్డల ఉపాధిపై నీలినీడలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.