గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా తరఫున పోటీ చేసిన కంకణాల నివేదిత వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి (ఆర్వో) బుధవారం తిరస్కరించారు. నివేదిత భర్త శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం భాజపా జిల్లాధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ టికెట్ రాకపోవడం, నామినేషన్ తిరస్కరణకు గురవడంతో వీరు ఏ పార్టీ వైపు వెళ్తారోనన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది.
తెరాసలో చేరే ప్రతిపాదన ఏదీ లేదని, పార్టీ ఆదేశానుసారం పనిచేస్తామని, ప్రచారంలో పాల్గొంటామని శ్రీధర్‌రెడ్డి ‘ఈటీవీభారత్’కు తెలిపారు. మరోవైపు పార్టీ టికెట్ ఆశించిన కడారి తెరాసలో చేరగా, రిక్కల ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నారు. టికెట్ ఆశించిన ఆశావహులను సమన్వయం చేయడంలో జాప్యం, క్షేత్రస్థాయి పరిస్థితిని అధిష్ఠానానికి వివరించడంలో జరిగిన పలు పొరపాట్ల వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ ముఖ్య నాయకుడొకరు ‘ఈటీవీభారత్’కు వెల్లడించారు.