ETV Bharat / state

సాగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశాం: శశాంక్‌ గోయల్‌ - ఎన్నికల సంఘం సీఈవో శశాంక్‌ గోయల్‌ వార్తలు

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో శశాంక్‌ గోయల్‌ తెలిపారు. 17న ఓటర్లు అందరూ తరలొచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

shashank goyal
శశాంక్‌ గోయల్‌
author img

By

Published : Apr 15, 2021, 6:03 PM IST

Updated : Apr 15, 2021, 7:06 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద 13 కేసులు, ఉల్లంఘనల కింద 116 కేసులు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో 46 లక్షల నగదు, 7,400 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈ మేరకు 71 కేసులు నమోదు చేసి 8 మందిని ఆబ్కారీ శాఖ అరెస్టు చేసిందని సీఈవో వెల్లడించారు. ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేయాలని కోరుతున్నామని.. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఓటర్లు కూడా కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఓటేయాలని పిలుపునిచ్చారు.

శశాంక్‌ గోయల్

ఇదీ చదవండి: టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షల రద్దు యోచనలో ప్రభుత్వం

Last Updated : Apr 15, 2021, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.