సాగర్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని మున్సిపాలిటీ ఎన్నికల ఇంఛార్జీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. నల్గొండ జిల్లా హాలియా పురపాలక సంఘంలో ప్రభుత్వ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన 12 వార్డుల్లోని లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో జరిపారు. హాలియాలోని సాగర్ రోడ్డు నుంచి లక్ష్మీనర్సింహా ఫంక్షన్‌హాల్ వరకు కేసీఆర్ ఫొటోలు, సంక్షేమ పథకాల ప్లకార్డులతో ర్యాలీగా వచ్చి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల గురించి సభలో ఎమ్మెల్యే గుర్తు చేశారు. లబ్ధిదారులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: 'అప్పులతో కాదు.. సంపదను పెంచుతూ అభివృద్ధి చేయండి'