ETV Bharat / state

ముప్పై రోజుల్లో మూడు కేసుల పరిష్కారం : ఏఎస్పీ - మిస్సింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక టీమ్

వివిధ కారణాలతో తప్పిపోయిన వారికోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు నల్గొండ అదనపు ఎస్పీ చోడగిరి సతీశ్​ తెలిపారు. యాంటీ హ్యూమన్​ ట్రాకింగ్​ టీమ్​ను ఏర్పాటు చేసి నెల వ్యవధిలో మూడు మిస్సింగ్​ కేసులను ఛేదించినట్లు వెల్లడించారు.

special human tracking team team to solve the missing cases in nalgonda dist
మిస్సింగ్​ కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందం
author img

By

Published : Jan 12, 2021, 7:17 PM IST

జిల్లాలో మిస్సింగ్ కేసుల ఛేదనే లక్ష్యంగా యాంటీ హ్యూమన్​ ట్రాకింగ్​ టీమ్​ ఏర్పాటు చేసినట్లు నల్గొండ అదనపు ఎస్పీ చోడగిరి సతీశ్​ అన్నారు. జిల్లాలో నమోదైన 78 కేసుల్లో నెలరోజుల్లోనే మూడు కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. డీఐజీ రంగనాథ్ చొరవతో సీఐ సత్యం నేతృత్వంలో ప్రత్యేక బృందం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

నెల వ్యవధిలోనే 2014, 2015, 2017 సంవత్సరాల్లో నమోదైన మిస్సింగ్​ కేసులను ఛేదించి.. వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుల పరిష్కారానికి ఆధార్ కార్డుతో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులను ఆధారంగా చేసుకుని గుర్తించినట్లు అదనపు ఎస్పీ సతీశ్​ తెలిపారు.

ఇదీ చూడండి : 'విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు.. ఖాళీలు భర్తీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.