ETV Bharat / state

NH65: ఆరు వరుసల రహదారి విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడో..? - 6 lane road works

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) ఆరు వరుసల రహదారి విస్తరణ పనులకు ఇప్పటివరకు ఎలాంటి మోక్షం కలగలేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ఏడాది జూన్‌లోగానే టెండర్ల ప్రక్రియను ముగించి.. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభించాలి. కానీ ఇప్పటివరకు ఎలాంటి కదలికా లేదు.

six-lane-road-widening-works-between-vijayawada-and-hyderabad

author img

By

Published : Jul 14, 2021, 2:25 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండి... అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) ఆరు వరుసల రహదారి విస్తరణ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ మార్గంలో గత నాలుగేళ్లతో పోలిస్తే రద్దీ రెట్టింపైంది. తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆరు వరుసల విస్తరణ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ రహదారి విస్తరణ పనులను ఈ ఏడాది జూన్‌లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి... వచ్చే ఏడాది జనవరిలో పనులను ప్రారంభించాలి. అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండుమల్కాపురం నుంచి.. ఏపీలోని నందిగామ వరకు 181.5 కి.మీ. నాలుగు వరుసల రహదారిని జీఎమ్మార్‌ సంస్థ సుమారు రూ. 1740 కోట్లతో 2010లో నిర్మించు - నిర్వహించు - బదిలీ చేయు (బీవోటీ) పద్ధతిలో చేపట్టింది. 2012 నిర్మాణ పనులను పూర్తి చేసి టోల్‌ వసూలును ప్రారంభించింది. పనులు మొదలుపెట్టిన పదకొండేళ్ల తర్వాత ఆరు వరుసల విస్తరణ పనులు ప్రారంభించి, 2024 వరకు పూర్తి చేయాలని.. విస్తరించాలని.. అప్పట్లో గుత్తేదారు సంస్థ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌లోగా విస్తరణకు సంబంధించి కాగితపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. భూ సేకరణకు సంబంధించి సైతం భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అప్పట్లోనే ఆరు వరుసలుగా విస్తరించేందుకు అవసరమైన భూమిని సేకరించారు. ఆ మేరకు కల్వర్టులు, అండర్‌పాసులు పలుచోట్ల నిర్మించారు.

ఎవరు నిర్మిస్తారు..

ఈ రహదారి నిర్మాణ సమయంలో రోజుకు 10 వేల వాహనాల రద్దీ అంచనా వేయగా... ప్రస్తుతం నిత్యం 30 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వారాంతంలో ఈ సంఖ్య 50 వేల వరకు ఉంటోంది. రద్దీ ఎక్కువవుతున్నా కొద్దీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎల్‌బీ నగర్‌ నుంచి దండుమల్కాపురం వరకున్న 25 కి.మీ. మార్గాన్ని 600 కోట్లతో ఎనిమిది వరుసలుగా విస్తరిస్తున్నారు. ఈ పనులతో పాటే మల్కాపురం నుంచి నందిగామ వరకు ఆరు వరుసల రహదారి పనులను చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. హైదరాబాద్‌ - విజయవాడ మధ్య విస్తరించిన 191.5 కి.మీ. మార్గాన్ని మరో రెండు వరుసలుగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆరు నెలల కాలంలో రెండు సార్లు ఎన్‌హెచ్‌ఏఐకి గుత్తేదారు కంపెనీ లేఖ రాసింది. అయితే ఈ పనులను ప్రస్తుత గుత్తేదారు కంపెనీతో చేయించాలా? లేదా.. ఇతర కంపెనీలకు అప్పగించడమా? అన్నది ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించాల్సి ఉంది. మరో మూడేళ్ల పాటు గుత్తేదారు కంపెనీ టోల్‌ వసూలుకు గడువు ఉన్న దృష్ట్యా ఈ పనులను చేయడానికి ప్రస్తుత కంపెనీకి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అండర్​పాసులకు త్వరలోనే ఆమోదం..

మరోవైపు రహదారి విస్తరణ సమయంలో చౌటుప్పల్, చిట్యాల వాసులు ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేయకపోవటం వల్ల ఆయా పట్టణాల నుంచే రహదారిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు మరణించడం వల్ల ఇక్కడ అండర్‌పాసులు నిర్మించాలని కంపెనీకి గుత్తేదారు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్‌ సమీపంలోని తంగెడుపల్లి, చిట్యాల, సూర్యాపేట, నకిరేకల్, మునగాల తదితర ప్రాంతాల్లో దాదాపు 16 అండర్‌పాసులు నిర్మించాలని గుత్తేదారు కంపెనీ నిర్ణయించింది. తాజాగా చౌటుప్పల్‌ వద్ద అండర్‌పాసు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. మిగిలిన పనులకు త్వరలోనే ఆమోదం వచ్చే అవకాశం ఉందని గుత్తేదారు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటూ నకిరేకల్, చౌటుప్పల్‌ వద్ద సర్వీసు రహదారులు సైతం నిర్మించాల్సి ఉంది.

హరితహారం మొక్కల పరిస్థితేంటీ?

రాష్ట్రంలోనే అతి తక్కువ అడవుల విస్తీర్ణం ఉన్న నల్గొండ జిల్లా నుంచే 2016లో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. అందులో భాగంగా దండుమల్కాపురం నుంచి కోదాడ వరకు ఈ రహదారికిరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటారు. ఇప్పుడవి చెట్లుగా ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం నాటిన మొక్కలు ఈ మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రతిబంధకంగా తయారయ్యాయి. ఎప్పుడు విస్తరణ చేపట్టినా ఇరువైపులా మొదటి వరుసలో నాటిన మొక్కలను తొలగించాల్సి ఉంటుంది. ఈ రహదారిని భవిష్యత్తులో ఆరు వరుసలుగా విస్తరిస్తారని తెలిసినా అధికారులు రహదారి పక్కనే మొక్కలు నాటడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పట్లో ఆలోచన లేదు

"ఎన్‌హెచ్‌ 65 జాతీయ రహదారిని ఆరు వరుసలుగా ఎప్పుడు విస్తరిస్తారనేది చెప్పలేం. పనులు చేస్తామని గుత్తేదారు కంపెనీ లేఖ రాసిన మాట వాస్తవమే. పనులు ఎవరికివ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది."- నాగేశ్వరరావు, ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ), ఎన్‌హెచ్‌ఏఐ.

ఇదీ చూడండి: Neopolis Kokapet: సర్కారుకు రూ.2500 కోట్లు వచ్చే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.