ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు

ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నా ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడటం లేదని ఆ శాఖ తాజాగా వెల్లడించిన నివేదికలో వెల్లడించింది. గత నెలలో విస్తారంగా కురిసిన వర్షాలతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పాతాళగంగ గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. గత నెలలో పోలిస్తే మూడు జిల్లాల్లోనూ సగటున ఆగస్టులో 2 మీటర్లకు పైగా భూగర్భ జల లభ్యత పెరగడం విశేషం.

Significantly increased groundwater in the joint Nalgonda district
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు
author img

By

Published : Sep 4, 2020, 8:03 AM IST

వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మూడు జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన తాగు, సాగు నీటి వనరైన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండగా మారడంతో ఎడమ కాల్వ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) ద్వారా అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు, ఏఎంఆర్‌పీ ద్వారా 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

మరోవైపు మధ్య తరహా ప్రాజెక్టు అయిన మూసీ గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. రెండు కాల్వల కింద దాదాపు 60 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టుల పరిధిలో కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుండటం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరగడం గమనార్హం. సూర్యాపేటలో 3 మీటర్ల లోతు లోనే భూగర్భజల లభ్యత ఉండటం విశేషం. ఈ సీజన్‌లో యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ఈ సీజన్​లో (జూన్​ నుంచి ఆగస్టు 31 వరకు) మూడు జిల్లాల్లో నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాకురవాల్సిన వర్షపాతం నమోదైన వర్షపాతంతేడా
నల్గొండ367.8436.719శాతం ఎక్కువ
సూర్యాపేట493.9581.318 శాతం ఎక్కువ
యాదాద్రి410.9560.336 శాతం ఎక్కువ

చిన్ననీటి వనరుల్లోనూ జలకళ

రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే 4440 చెరువులున్నాయి. ప్రస్తుతం వీటిలో దాదాపు 50 శాతానికి పైగా చెరువులు అలుగు పోస్తుండగా...మరో 30 శాతం చెరువులు 70 శాతానికి పైగా నిండాయి. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో దాదాపు దశాబ్దకాలం నుంచి వట్టిపోయిన కుంటలు, చెక్‌డ్యాంలు గత నెలలోనే నిండుకుండలను తలపించాయి. సాగు విస్తీర్ణం మూడు జిల్లాల్లోనూ గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌ నుంచే ప్రభుత్వం నియంత్రిత సాగును అమలు చేస్తున్న దృష్ట్యా ఉమ్మడి జిల్లాలో వర్షాకాలంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అధికారుల అంచనా వేయగా... ప్రస్తుతం అంచనా కంటే ఎక్కువగానే పంటలు సాగయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో అత్యధికంగా పత్తి 12 లక్షల ఎకరాలకు పైగా సాగు చేయగా...వరి దాదాపు 8 లక్షలకు పైగా ఎకరాల్లో సాగవుతోంది. మిగితా పంటలు మరో లక్ష ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాగర్‌లో రెండు పంటలకు సరిపడా నీళ్లు ఉండటంతో ప్రస్తుతం గరిష్ఠ స్థాయిలో పంటలు సాగవుతున్నాయి.

మూడు జిల్లాల్లో భూగర్భ జలలభ్యత( మీటర్లలో)

జిల్లాఆగస్టు-2019జులై-2020ఆగస్టు 2020

పెరిగిన నీటిమట్టం

(మీటర్లలో)

నల్గొండ14.6110.728.162.56
సూర్యాపేట10.025.023.091.93
యాదాద్రి15.6011.218.552.66

ఇవీ చూడండి: అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.