విద్యార్థినులకు మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీసులు రెండున్నర కి.మీ పరుగును నిర్వహించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన కార్యక్రమాన్ని ఎస్పీ రంగనాథ్ ప్రారంభించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన పరుగులో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు చేపడుతున్న రక్షణ చర్యలను కళాజాత బృందాలు పాటల ద్వారా చిన్నారులకు తెలియజేశారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు