వైకల్యం శరీరానికే గానీ మనసుకు కాదని నిరూపించారు నల్గొండ జిల్లా అవంతిపురంలోని బధిరుల పాఠశాల విద్యార్థులు. తమ పాఠశాలను హరితవనంగా మార్చారు... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలోని బధిరుల పాఠశాల విద్యార్థులు.
వారసత్వంగా మొక్కల బాధ్యత
పాఠశాల ప్రారంభించిన నాటి నుంచి ఉపాధ్యాయుల సూచనల మేరకు మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు. ఏటా సీనియర్ నుంచి జూనియర్లకు మొక్కలను నాటే బాధ్యతను అప్పగిస్తున్నారు. బధిర విద్యార్థులు కమిటీలుగా ఏర్పడి మొక్కలను నాటి.. వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. పంచుకున్న మొక్కలకు ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పెట్టడం ఆ పరిసరాలలో పిచ్చి మొక్కలు తొలగిస్తూ ఆహ్లాద వాతావరణాన్ని సృష్టించారు.
కాలుష్య రహిత పాఠశాల వాతావరణం
వారి లక్ష్యం ముందు శరీర వైకల్యం చిన్నబోయింది. పాఠశాలలో బధిర విద్యార్థులు కాలుష్య రహిత ప్రశాంతత వాతావరణం సృష్టించుకున్నారు. ప్రకృతితో స్నేహం చేస్తూ స్కూల్ ఆవరణలో ప్రాణవాయువు మెండుగా ఉండేలా చూసుకుంటున్నారు. ఆరంభ సమయంలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయి.
'అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలి'
పాఠశాలను అందంగా తయారుచేసుకున్న వీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. బడిని హరితవనంగా సాగు చేసేందుకు వారికి స్ఫూర్తినిచ్చిన అంశాలపై, వారి అనుభవాలను, ఉపాధ్యాయుని సాయంతో సంజ్ఞలు చేస్తూ తెలుపుతున్నారు. ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు ముందడుగు వేసి పిల్లల చేత మొక్కలు నాటించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండిః నియమాలు ఉల్లంఘిస్తున్న యూట్యూబ్ స్టార్స్