ETV Bharat / state

కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'

కరోనా ధావనంలా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకెల్లదీస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు, ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ... వీటిని పర్యవేక్షించాల్సిన సర్పంచే నిబంధనల్ని కాలరాసి క్రికెట్​ ఆడాడు.

sarpunch break th lock down riles and played cricket
కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'
author img

By

Published : Apr 16, 2020, 7:40 PM IST

కరోనా కట్టడి కోసం ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరికి కథానాయకుడై... ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే పిలుపునిచ్చారు. కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కానీ... ఆ ఊరి సర్పంచ్​కి మాత్రం ఇవేవీ చెవికెక్కలేదు. నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి... చిన్నపిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు.

నల్లొండ జిల్లా మర్రిగూడెం మండలం వెంకేపల్లి తండా సర్పంచ్ కొర్ర శ్రీను... తన బాధ్యతను మరచి చిన్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. దేశమంతటా లాక్​డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా వాటిని ఉల్లంఘించాడు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటిస్తూ... ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వాల పిలుపును మాత్రం ఆయన లెక్కచేయలేదు.

కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'

ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.