నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్ కు 2 లక్షల 13 వేల 034 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్థి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.20 టీఎంసీలుగా ఉంది.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా..
నాగార్జునసాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 21 వేల క్యూసెక్కుల నీరు, సాగర్ కుడి కాల్వకు 7 వేల 878 క్యూసెక్కుల నీరు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీరు మొత్తం కలిపి సాగర్ నుంచి ఔట్ ఫ్లోగా విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను గత నెల నుంచి నేటికి 3 సార్లు ఎత్తారు.
ఇవీ చూడండి : సాగర్‌కు భారీ వరద... 4 గేట్ల ఎత్తివేత.. 311 టీఎంసీల నీటినిల్వ