నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసేందుకు విఫలయత్నం చేశారు.
దేశానికి స్వేచ్ఛ వచ్చినప్పటికీ...
ఈ క్రమంలో కాషాయ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని... కానీ హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోతుండేదని భాజపా నేతలు గుర్తు చేశారు.
13 నెలల అనంతరం..
సాయుధ పోరాటాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య వల్ల స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనం అయిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని కాషాయ శ్రేణులు డిమాండ్ చేశాయి.