ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టిసారించారు. సంస్థ పనితీరు..? సిబ్బంది సహకారం...? బస్సుల సమయపాలన..? ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి బస్సులో వెళ్లిన సజ్జనార్.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి నల్గొండకు బస్సులో ప్రయాణించారు. నల్గొండ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటి.. ప్రయాణికులతో మాట్లాడారు. వారి సూచలు, సలహాలు స్వీకరించారు. బస్టాండ్‌లోని షాపులను తనిఖీ చేశారు.
ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం. ఆర్టీసీలో గమ్యాలకు సురక్షితంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ తరఫున ప్రయాణికుల కోసం మరిన్నీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. పెళ్లి, వన భోజనాలు, విహారయాత్రల కోసం స్పెషల్ కొన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. కరోనా తర్వాత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ప్రయాణికులకు బస్సులను అందుబాటులో ఉంచాం. ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నా ట్విట్టర్ ఖాతాకు మీ అభిప్రాయాలను తెలపండి.
-సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
అనంతరం రీజినల్ మేనేజర్, ఇతర ఆర్టీసీ అధికారులతో కాసేపు సమావేశం నిర్వహించారు. మరో బస్సులో మిర్యాలగూడ బస్‌స్టేషన్‌కు వెళ్లారు. ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలు తెలపాలని సజ్జనార్ సూచించారు.
ఇదీ చూడండి: Rtc Md Sajjanar: పుష్పక్ బస్‌లో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Letter to CJI: విద్యార్థిని లేఖకు స్పందించిన సీజేఐ.. అధికారులకు ఆదేశం
TSRTC: ఆర్టీసీ నంబర్‌తో ప్రైవేట్ బస్సు.. ఇన్ని రోజులు గుర్తించలేదా..?
Student complaint: బస్సులు టైంకి రావడం లేదని ఆ విద్యార్థిని ఏకంగా...
TSRTC Special Offer: రూ. వంద చెల్లించండి.. రోజంతా ప్రయాణించండి