ETV Bharat / state

జైపాల్​రెడ్డి మృతదేహంతో కార్మికుల ఆందోళన

నల్గొండ జిల్లా దేవరకొండలో గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం అంత్యక్రియల కోసం హైదరాబాద్​ తరలించారు.

నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్​ మృతి
author img

By

Published : Nov 4, 2019, 4:24 PM IST

నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్​ మృతి

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లికి చెందిన జైపాల్​ రెడ్డి కుటుంబంతో హైదరాబాద్​లో నివాసముంటున్నాడు. దేవరకొండ డిపోలో ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేస్తున్న జైపాల్​రెడ్డి... నిన్న జరిగిన కార్మికుల సమ్మెలో పాల్గొన్నాడు. సమ్మె ముగిశాక.. ఇంటికి చేరుకున్న జైపాల్​రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు.

జైపాల్​రెడ్డి మృతదేహాన్ని దేవరకొండ డిపో ముందు ఉంచి కుటుంబ సభ్యులు, కార్మికులు ధర్నా చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు పట్టణ బంద్​కు పిలుపునిచ్చారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించగా... కాసేపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

మృతదేహంతో స్థానికి డిపో నుంచి కొండల్​రావు బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్​ తరలించారు.

Intro:TG_NLG_32_05_RTC_DRIVER_CREMATION_THARALIMPU_AV_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్,దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365,9666282848

Body:నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు.నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి దేవరకొండ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.నిన్న సాయంత్రం వరకు కార్మికులు డిపో ముందు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని ఇంటికి వెళ్లిన కార్మికుడు జైపాల్ రెడ్డి అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దేవరకండలోని ప్రయివేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.మృతిదేహాన్ని దేవరకొండ డిపో ముందు ఉంచి ఉదయం నుంచి కుటుంబ సభ్యులు,కార్మికులు అన్ని పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు.బస్సులు అన్ని డిపోకు పరిమితమయ్యాయి.డ్రైవర్ మృతికి సంతాపంగా పట్టణ బంద్ ను నిర్వహించారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.కేసీఆర్ తమ మొండి వైఖరిని వెనక్కి తీసుకొని ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.మృతదేహంతో స్థానిక డిపో నుంచి కొండల్ రావు బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి అంత్యక్రియలు కోసం హైదరాబాద్ తరలించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.