నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం జరిగింది. పట్టణంలోని సరిత ఆస్పత్రిలో నాలుగు రోజుల పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాకు చేశారు.
పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మస్తాన్ షాహీన్ దంపదులకు నాలుగు రోజుల కిందట స్థానిక సరిత ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. ఆదివారం రాత్రి బాలుడు అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.
ఇవీ చూడండి: గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక