కలెక్టర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ఈదులగూడెం కాలనీలో ఉన్న రెడ్‌జోన్‌ను ఎత్తివేసి రాకపోకలకు అనుమతిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈదురగూడెం కాలనీలో కరోనా పాజిటివ్‌గా వచ్చిన మహిళ కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడం, ఆ కాలనీపై విధించిన క్వారంటైన్ గడువు ముగిసిపోవడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టణం ఫ్రీ జోన్ జాబితాలోకి చేరింది.
రెడ్‌జోన్‌ను ఎత్తివేసినప్పటీకి లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆర్డీవో తెలిపారు. కాలనీవాసులు భౌతిక దూరం పాటించిస్తు, మాస్కులు ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: గంజ్ కారణంగానే వనస్థలిపురంలో కొవిడ్ కేసులు