వనస్థలిపురంలో నివసించే మూడు కుటుంబాల్లో పదకొండు మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన ఎస్‌కేడీనగర్, ఏ, బీ టైపు క్వార్టర్స్, ఫేజ్-1, హుడాసాయినగర్‌లోని కొన్ని వీధుల్లో అధికారులు వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసి ఆరోగ్య సర్వే చేపట్టారు.
మరోవైపు కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోమవారం పర్యటించారు. కాలనీల్లో చేపడుతున్న వైరస్ నివారణ చర్యలను పరిశీలించారు. గత వారంరోజుల వరకు హయత్‌నగర్ డివిజన్‌లో జీరో పాజిటివ్ కేసులు ఉన్నాయని సుధీర్ రెడ్డి అన్నారు.
దురదృష్టవశాత్తు మలక్‌పేట్‌లోని గంజ్ కారణంగా వనస్థలిపురం పరిధిలో కరోనా కలకలం రేపిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా స్థానికులంతా భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని.. వైరస్ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలెవరూ బటయకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష