నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు దాటుతున్న యువకున్ని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లా పరిధిలోని నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన లింగయ్య, విజయమ్మల కుమారుడు పల్లి సతీష్ మిర్యాలగూడలో హౌసింగ్ బోర్డ్ వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'