నల్గొండ పట్టణంలో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది. పగటిపూట భానుడి భగభగలతో అల్లాడిపోతున్న పట్టణవాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. కానీ ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, ప్లెక్సీలు విరిగిపడడం వల్ల అక్కడక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!