ETV Bharat / state

శిథిలావస్థలో మునుగోడు పాఠశాల - munugodu

నిధుల లేమితో శిథిలావస్థకు చేరిన భవనాలు... అరకొర సౌకర్యాలతో విద్యార్థుల అవస్థలు... ఉపాధ్యాయులు లేక కుంటుపడుతున్న చదువులు... విద్యార్థులు లేక మూత పడుతున్న సర్కారు బడులు. ప్రభుత్వ పాఠశాలల గురించి ఇలాంటి సమస్యలు ఎన్నో వినుంటాం. కానీ నిధుల పుష్కలంగా ఉన్నా.. పనులు చేయడానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినా... అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు సాగని పాఠశాల ఉందంటే నల్గొండ జిల్లా మునుగోడు జిల్లా పరిషత్​ పాఠశాలేనని చెప్పుకోవచ్చు.

శిథిలావస్థలో మునుగోడు పాఠశాల
author img

By

Published : Sep 5, 2019, 12:00 AM IST

పెచ్చులూడిపోయిన స్లాబులు, నీళ్లు కారుతున్న గోడలు... కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తరగతి గదులు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విద్యార్థులు... నల్గొండ జిల్లా మునుగోడు జిల్లా పరిషత్​ పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. తరగదుల నిర్మాణం కోసం నిధులు మంజూరైనా... అధికారుల జాప్యం వల్ల పనులు కార్యరూపం దాల్చక 2019-20 విద్యాసంవత్సరంలో కూడా విద్యార్థులకు కష్టాలు తప్పేలా లేవు.

ప్రారంభం కాని పనులు

మునుగోడు పాఠశాలలోని 20 తరగతి గదుల్లో 15 శిథిలావస్థకు చేరాయి. మిగిలిన ఐదు గదులతోనే రోజులు నెట్టుకొస్తున్నారు. పరిస్థితి గమనించిన జిల్లా కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ ఆదేశాలతో జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధుల నుంచి రూ.68 లక్షలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్​ నిధుల నుంచి మరో రూ. 72 లక్షలు గతేడాదిలోనే మంజూరయ్యాయి. పనులు ప్రారంభానికి గతేడాది డిసెంబరులోనే టెండర్లు నిర్వహించారు. నూతనంగా 14 గదుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.

ఇబ్బందులు వర్ణణాతీతం

అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్న చందంగా నిధులున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడు ఏ గది కూలుతుందో... ఏ స్లాబు మీదపడుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ప్రజాప్రతినిధుల నిరాహారదీక్ష

తరగతి గదుల నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్​ చేస్తూ స్థానిక ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు పాఠశాల ముందు రిలే నిరాహార దీక్ష చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని స్థానికులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

శిథిలావస్థలో మునుగోడు పాఠశాల
ఇదీ చూడండి: 'కార్పొరేట్​కు దీటుగా నాణ్యమైన విద్యే గురుకుల పాఠశాల ఉద్దేశం'

Intro:TG_NLG_111_30_Samasyala_Badi_pkg_Ts10102

నిధులున్నా .....నీష్ప్రయోజనం
మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తరగతి గదులు శిధిలావస్థలో ఉండడంతో విద్యార్థులు అవస్థలతో కాలం వెళ్లదీస్తున్నారు. వారిని చూసి అధికారులు మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి టెండలను సైతం పిలిచారు. కానీ పనులను ప్రారంభించేందుకు గత కొన్ని రోజులుగా అధికారులు జాప్యం చేస్తున్నారు. నేటికి పనులుప్రారంభం కాకపోవడంతో ఆ గదుల్లో విధ్య ను అభ్యసించడం కష్టంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో 2019 20 విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

*టెండర్లు పూర్తి నెలలు*
మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 20 తరగతి గదుల్లో 15 గదులు పూర్తి శిథిలావస్థకు చేరాయి.5 తరగతి గదులు మాత్రం కొంతమేర బాగున్నాయి .అదనపు తరగతి గదులను ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధుల నుంచి 68 లక్షల ను గత ఏడాది సెప్టెంబర్ 3న నిధులు మంజూరు చేశారు. దీంతో పాటు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ నిధుల నుంచి మరో 72 లక్షలు రూపాయల నిధులు మంజూరు కావడంతో గత ఏడాది డిసెంబర్లో టెండర్లు నిర్వహించారు .సుమారు 14 గదులను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

ఇబ్బందులు పడాల్సిందే నా

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాలావరకు తరగతి గదులు పూర్తి స్థితిలో శిథిలదశకు చేరుకున్నాయి. చిన్నపాటి వర్షం కురిసిన గోడల పైకప్పు నుంచి నీరు మట్టి తో కలిసి రాలుతుంది పైనుంచి పడుతున్న నీళ్ళ తో మట్టి పెడ్డలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇన్నాళ్లు ఎలా గోలా కొనసాగిన ప్రస్తుతం మరింత శిథిలమయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే కూలే దశలో ఉన్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. ఆయా పాఠశాలకు తరగతి గదులు తోపాటు ఉపాద్యాయుల విశ్రాంతి గదులు సైతం కూలిపోయే దశలో ఉన్నాయి. మరుగుదొడ్లు కూడా తగినన్ని లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని ఈ విషయాన్ని జిల్లా అధికారులు గుర్తించి పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు .

ప్రజాప్రతినిధులు ...నిరాహారదీక్ష

ఈ పాఠశాలలో గదుల నిర్మాణం వెంటనే చేపట్టాలని స్థానిక ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు రీలే నిరాహారదీక్ష ను చేపట్టారు.

బైట్స్
1 శిరీష
2 శివాణి
3నరేష్
4 వెంకన్న Aiyf నాయకులు
5 విప్లవ్ Aisf విద్యార్థి నాయకులు
6 పుల్లయ్య పాటశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు.

Body:మునుగోడు నియోజకవర్గంలో
నల్లగొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.