మంగళవారం నకిరేకల్‌లో ద్విచక్ర వాహనాన్ని హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చందుపట్లకు చెందిన నగేష్, గోపాల్ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు, స్థానికులు సుమారు గంట సేపు రాస్తారోకో చేయటంతో... రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.