నల్గొండ జిల్లా రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాలతో మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఉన్న పలు ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15-20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.
శుక్రవారం జి.అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ను ప్రారంభించాలంటూ కాంగ్రెస్ నాయకులతో కలిసి రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళనను విరమించారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం