తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నాంపల్లిలో చేనేత కార్మికులు గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు కరోనా కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. వాటిని ఖర్చు చేయకుండా పక్కకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి: బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్‌పై సీబీఐలో కేసు నమోదు