ETV Bharat / state

పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరార్​ - ఖైదీ పరారీ

పోలీసు కళ్లు గప్పి ఓ రిమాండ్ ఖైదీ పరారైన ఉదంతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఒకటో ఠాణా పోలీస్​స్టేషన్​లో చోటుచేసుకుంది.

Prisoner escape from miryalaguda jail in nalgonda district
పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరార్​
author img

By

Published : Dec 10, 2019, 9:40 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసు ఠాణా నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. సూర్యాపేటకు చెందిన నరందాసు మణికంఠ అనే నిందితుడు పోలీసుల కళ్లు గప్పి ఉడాయించాడు.

మోటారుసైకిళ్ల చోరీ కేసులో గత నెల 29న పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. అయితే విచారణ నిమిత్తం పోలీసులు... నిందితుణ్ని మిర్యాలగూడ సబ్ జైలు నుంచి ఈ నెల 7న ఒకటో పట్టణ ఠాణాకు తరలించారు. రెండ్రోజుల కస్టడీ అనంతరం అప్పగించాల్సి ఉండగా... సోమవారం తెల్లవారుజామున సంకెళ్లు తెంచుకుని పరారైనట్లు పోలీసు అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: దిశ హత్య కేసు: నిందితుల్లో ఇద్దరు మైనర్లు?

TG_NLG_02_09_Khaidee_Paraaree_Dry_3067451 Reporter: I.Jayaprakash ----------------------------------------------------------------- ( ) నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసు ఠాణా నుంచి... ఖైదీ పరారయ్యాడు. మోటారుసైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న సూర్యాపేటకు చెందిన నరందాసు మణికంఠ అనే నిందితుడు... పోలీసుల కళ్లు గప్పి ఉడాయించాడు. గత నెల 29న సదరు నిందితుణ్ని అరెస్టు చేయగా... కోర్టు రిమాండ్ విధించింది. అయితే విచారణ నిమిత్తం పోలీసులు... నిందితుణ్ని మిర్యాలగూడ సబ్ జైలు నుంచి ఈ నెల 7న ఒకటో పట్టణ ఠాణాకు తరలించారు. రెండ్రోజుల కస్టడీ అనంతరం అప్పగించాల్సి ఉండగా... సోమవారం తెల్లవారుజామున సంకెళ్లు తెంచుకుని పరారైనట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ........................Dry
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.