President Draupadi Murmu at Hyderabad Public School : వందేళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) ప్రయాణంలో సమాజానికి అత్యుత్తమ నాయకులను అందించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(Hyderabad Public School) శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు.
సత్య నాదెళ్ల, శాంతను నారాయణ, పద్మ విభూషణ్ నాగేశ్వర్ రెడ్డి వంటి వారు హెచ్‌పీఎస్‌లో విద్యను అభ్యసించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. పాఠ్యాంశాలు బోధించటంతో పాటు ఇక్కడ విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారితో పాటు భావోద్వేగాలను నియంత్రించుకుంటూ భిన్న పరిస్థితుల్లో సమర్థంగా పని చేసే వారికి అవకాశాలు అధికంగా వస్తాయని రాష్ట్రపతి తెలిపారు.
President Visit Bhoodan Pochampally Tomorrow : శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ బిజీబిబీగా గడుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి(Pochampally)లో బుధవారం(రేపు) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. చేనేత టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ ప్రక్రియను ఆమె పరిశీలించనున్నారు. కార్మికులతో మాట్లాడనున్నారు. ఇక్కడ రాష్ట్రపతి పర్యటన సుమారు గంటకు పైగా జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Bhoodan Pochampally: ఖండాంతరాలు దాటిన ఖ్యాతి.. ప్రపంచ పర్యాటక గ్రామంగా 'భూదాన్ పోచంపల్లి'
భూదాన్ పోచంపల్లిలో భారీ భద్రత : భారీ పోలీస్ బందోబస్తు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు వాయుసేన, పారా మిలటరీ దళాలు భద్రతలో పాల్గొననున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి చేరుకోనున్నారు. నేడు పలుమార్లు హెలిప్యాడ్ నుంచి రాష్ట్రపతి కాన్యాయ్ ట్రయల్ నిర్వహించారు. బాలాజీ ఫంక్షన్ హాలుతో పాటు హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎవరినీ ఇక్కడకు అనుమతించలేదు.
"హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాబోధన పరంగా ఎన్నో విజయాలు సాధించడం సహా చరిత్ర సృష్టించేవారిని కూడా తయారు చేసింది. ఈ విద్యాసంస్థలో విద్యార్థులను విభిన్న రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ప్రేరేపిస్తుంటారు. తద్వారా మన దేశానికే గౌరవం లభిస్తోంది. ఇక్కడి విద్యార్థులకు ఉన్న వసతులు, సదుపాయాలు, అవకాశాలు చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది." - ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
ముందుగా భూదాన్ పోచంపల్లి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రూరల్ టూరిజం కాంప్లెక్స్‌లో భూధాన ఉద్యమకారుడు ఆచార్య వినోభా భావే, భూదాత వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలదండలు వేయనున్నారు. అనంతరం వినోభా భావే మందిరంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్నారు. భూదానంకు సంబంధించిన కీలక ఘట్టాలతో కూడుకున్న ఫొటో చిత్రాలను అధికారులు ద్రౌపది ముర్ముకు వివరించనున్నారు. ఆ తర్వాత చేనేత కార్మికుల(Handloom Workers) ఇళ్లకు వెళ్లి మాట్లాడతారనే సమాచారం ఉంది. చివరగా బాలాజీ ఫంక్షన్ హాలులో చేనేత కుటుంబాలు, అవార్డు గ్రహీతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇందుకు తగిన అన్ని ఏర్పాట్లను కలెక్టర్, కేంద్ర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
శీతాకాల విడిదికై రాష్ట్రానికి రాష్ట్రపతి రాక - స్వాగతం పలికిన గవర్నర్, సీఎం