నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు కోరమండల్ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందించారు. ఏటా వేయి మంది విద్యార్థినులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తొమ్మిదో తరగతిలో ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ. ఐదు వేలు, ద్వితీయ ర్యాంక్ వచ్చిన వారికి రూ. 3500 బహుమతి ఇస్తున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!