ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలే రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతోందని తెలిపారు. సాగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు మన పథకాల వైపు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. 35 ఏళ్లుగా జానారెడ్డికి ఓటు వేస్తున్నా... నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. అందువల్లే ప్రజల్లోకి రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గం సమస్యలు పరిష్కారం కావాలంటే... కారు గుర్తుకు ఓటు వేసి యువకుడు, విద్యావంతుడైన నోముల భగత్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నోముల భగత్‌తో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని