నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో నిషేదిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. మిర్యాలగూడలోని విద్యానగర్‌కు చెందిన గంధం వెంకటేశ్వర్లు అనే వ్యాపారస్తుడు బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి పట్టణంలో ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు రూ.15 వేల విలువ గల గుట్కా స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యాపారి రాజు వద్ద రూ. 8 వేల విలువైన గుట్కాప్యాకెట్లు దొరికాయి. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిషేధిత గుట్కా విక్రయిస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఇవీ చూడండి: యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!