ETV Bharat / state

WATER DISPUTES: కొనసాగుతున్న జలవివాదం.. సాగర్‌ డ్యాం వద్ద భారీ భద్రత - police force at sagar dam and pulichinthala

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. ఆనకట్ట, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వద్ద... సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఇతరులెవరినీ పవర్ హౌజ్​లోకి అనుమతించడం లేదు. మరోవైపు జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదని... ఆ హక్కు ఏ కమిటీకి, కమిషన్​కు లేదని రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. అటు జూరాల, పులిచింతల జలాశయాల వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

water disputes between ap and telangana
సాగర్‌ డ్యాం వద్ద భారీ భద్రత
author img

By

Published : Jul 1, 2021, 9:53 AM IST

కృష్ణా బేసిన్​లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదం దృష్ట్యా... జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్సైలతో పాటు ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్​కు చెందిన వంద మంది... ప్రాజెక్టు వద్ద పహారా కాస్తున్నారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద భారీగా సాయుధ బలగాల మోహరించారు. ఉద్యోగులు మినహా ఎవరినీ పవర్‌హౌస్‌లోకి అనుమతించడం లేదు. జూరాల ఆనకట్టపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. జూరాల జల విద్యుత్ కేంద్రం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. కాగా నాగార్జునసాగర్ జలాశయం వద్ద నిన్నటి నుంచి బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఏపీ సరిహద్దు అయిన సాగర్‌ బ్రిడ్జి వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారని

312 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను ప్రస్తుతం సాగర్​లో.. 176.2 టీఎంసీల నీరుంది. ఎగువన శ్రీశైలం నుంచి 31 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా... అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతూ 8 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఏపీ నేతలు, అధికారులు అడ్డుకుంటారన్న సమాచారంతో... పొరుగు రాష్ట్ర సరిహద్దు అయిన సాగర్ వంతెన వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలన చేస్తున్నారు. 2015లో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య... సాగర్ ప్రాజెక్టుపైనే గొడవ జరిగింది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రస్తుతం... డ్యాం వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు.

ఇరు రాష్ట్రాల వాదనలు

రైతుల అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ మీడియా సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖలు రాస్తామని వారు తెలిపారు. మరో వైపు .. ఎన్జీటీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి

ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏపీ ప్రభుత్వం పోలీసులను మోహరించింది. తెలంగాణ విద్యుదుత్పత్తి దృష్ట్యా ఆ ప్రభుత్వం భద్రతను పెంచింది. పులిచింతలలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తిపై ఏపీ అభ్యంతరం చెప్పింది. ప్రస్తుతం పులిచింతలలో 20.52 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఎగువ నుంచి పులిచింతలకు 32 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. తెలంగాణ జెన్‌కోకు ఇప్పటికే ఏపీ అధికారులు లేఖ రాశారు.

పులిచింతల జలాశయం వద్ద... సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు భద్రతలో ఉన్నాయి. రెండ్రోజుల నుంచి పులిచింతలలో తెలంగాణ జల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. మొత్తం నాలుగు యూనిట్లలో రెండు యూనిట్ల ద్వారా... 15 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. 45.77 టీఎంసీలకు గాను జలాశయంలో... 19 శతకోటి ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నుంచి 36 వేల 407 క్యూసెక్కుల వరద పులిచింతలకు వస్తుండగా... విద్యుదుత్పత్తి ద్వారా అంతే మొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నారు. అటు ఏపీ ప్రభుత్వ తీరుపై విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

'జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదు. ఆ హక్కు ఏ కమిటీకి గానీ లేదా కమిషన్​కు గానీ లేదు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుదుత్పత్తి కోసం. కృష్ణానది వాటాలో భాగంగా... ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుంటాం.' జగదీశ్​రెడ్డి, విద్యుత్​ శాఖ మంత్రి

తెలంగాణ నీటి దోపిడీకి పాల్పడుతోందంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనను మంత్రి జగదీశ్ రెడ్డి తిప్పికొట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Pillalamarri: పిల్లలమర్రికి పురావస్తు పార్కు.. రెండెకరాల్లో అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.