Police Conduct Extensive Checking in Telangana : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ(EC) షెడ్యూల్ ప్రకటనతో పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో మీడియా విభాగాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సమగ్ర సమాచారాన్ని మీడియాకేంద్రంలో ఎప్పటికపుడు అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నూతన సీపీ సందీప్ శాండిల్య అన్నారు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో బాధ్యతలు స్వీకరించారు. సాంకేతికతను జోడించి.. పోలింగ్ విధులు నిర్వహిస్తామన్నారు.
Police Caught Huge Amount in Vehicles in Telangana : రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వాహన తనిఖీల్లో భారీగా సొత్తు పట్టుబడుతోంది. హైదరాబాద్ కేపీహెచ్బీలో పోలీసుల వాహన తనిఖీలు(Vehicle Inspections) చేస్తుండగా.. సరైన పత్రాలు లేని రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాలినడకన వెళ్తున్న మహిళ ప్లాస్టిక్ కవర్‌లో తరలిస్తున్న రూ.8 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని అంతరాష్ట్ర చెక్ పోస్టు(Check Post) వద్ద కారులో తరలిస్తున్న నాలుగు లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్‌గేటు వద్ద కర్ణాటక బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తుల నుంచి రూ.15 లక్షల నగదు, 45 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
RS.1.5 Crore Seized by Police in Nalgonda : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వ్యక్తి నుంచి రెండున్నర లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో అనధికారంగా బైక్‌పై తరలిస్తున్న కోటి యాభై లక్షల నగదు సీజ్ చేసినట్లు సీఐ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని బెల్టు దుకాణాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన లక్ష విలువైన మద్యం(Liquor Seize) పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పాత బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి తన కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 83 చీరలను పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు.
Collector Visit Check Post in Nalgonda : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి తెలంగాణ- ఆంధ్రా సరిహద్దుల్లోని చెక్‌పోస్టును కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. ఆంధ్రా నుంచి మద్యం, డబ్బులు అక్రమ రవాణా(Trafficking) కాకుండా నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజువారి తనిఖీ నివేదికలు అందజేతలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
Police Caught Huge Hawala Cash in Hyderabad: బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్ల హవాలా మనీ పట్టివేత