నల్గొండ జిల్లా పెద్దవూర సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కర్నాటి విజయ్ భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పెద్దవూరలో ఆయన భౌతిక దేహానికి మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉద్యమ సమయం నుంచి కర్నాటి విజయ్ భాస్కర్ రెడ్డి తనకు బాగా తెలుసునని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'మాస్టర్' దర్శకుడితో ప్రభాస్ చిత్రం!