నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో మార్పులు వస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన కాంగ్రెస్ ‘జనగర్జన’లో ఆయన పాల్గొన్నారు. 2023లో ప్రభుత్వ మార్పునకు నాగార్జునసాగర్‌లోనే నాంది పడాలన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తెరాస చేసింది శూన్యమని విమర్శించారు. ఇక్కడ భాజపాకు డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు.
ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్లి వరాలు కురిపించి ప్రజలను మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఉత్తమ్ చురకలంటించారు. ఈ ఆరేళ్ల కాలంలో సాగర్‌కు తెరాస ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. సాగర్ ప్రజల ప్రేమాభిమానాలతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. జనగర్జన సభలో జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వీహెచ్, కొండ సురేఖ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సాగర్' అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించనున్న బండి