Nagarjuna sagar project Paintings : నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు... ప్రధాన వంతెన కొత్త హంగులు సంతరించుకుంటోంది. సాగర్ ప్రధాన జలాశయం, ఎడమ కాలువ వద్దనున్న రక్షణ గోడలకు... రూ.10 లక్షలతో రంగు వేయడం దాదాపు పూర్తి కావొచ్చింది.
జలాశయం రక్షణ గోడలకు గతంలో ఆకుపచ్చ రంగు వేయగా... 2017లో రాష్ట్ర ప్రభుత్వం గులాబీ రంగు వేయించింది. దీనికి అభ్యంతరం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గులాబీ రంగుపై నీలం రంగు బోర్డర్లు వచ్చేలా రంగు వేశారు. ప్రస్తుతం కూడా అవే రంగులు వేస్తున్నారు.
ఇక వంతెనపై తారు రోడ్లు వేయడం కోసం... కోటి 20 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచిన అధికారులు.. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయనున్నారు.
ఇదీ చదవండి: సాగర్ భూములపై ప్రజాప్రతినిధుల కన్ను.. ఆక్రమణలపై ఉక్కుపాదం