ETV Bharat / state

Paddy Purchase In Telangana : దసరా తర్వాతే వానాకాలం ధాన్యం కొనుగోళ్లు! - Paddy Purchase In nalgonda district

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు... దసరా తర్వాతే మొదలు కానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో ఏ మేరకు కొనుగోళ్లు జరుగుతాయనేది చర్చనీయాంశంగా మారినా... అందుకు సంబంధించిన సన్నద్ధతను ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యంత్రాంగాలు ప్రారంభించాయి.

Paddy Purchase In Telangana
Paddy Purchase In Telangana
author img

By

Published : Oct 5, 2021, 9:03 AM IST

ధాన్యం సేకరణలో రికార్డులు సృష్టిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా... ఈ వానాకాలం సీజన్​లోనూ అదే రిపీట్ చేయనుంది. రాష్ట్రవ్యాప్త కొనుగోళ్లలో 25 శాతం... నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచే వస్తోంది. మూడు జిల్లాల పరిధిలో 800 దాకా కేంద్రాలు ఏర్పాటు చేసి... ధాన్యం సేకరణ చేపడతారు. అత్యధికంగా బియ్యపు మిల్లులున్న ప్రాంతం కాబట్టి... గత సీజన్లలో ఇతర జిల్లాల పంటను కూడా నల్గొండ జిల్లాకు తరలించారు. అయితే ఈసారి ఇబ్బందుల్లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా... మూడు జిల్లాల యంత్రాంగాలు అప్పుడే కార్యాచరణను ప్రారంభించాయి. ఈ దసరా తర్వాత కొనుగోళ్లు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. గత వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా... అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే 12 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది.

గత యాసంగిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేకరించిన ధాన్యం... మిల్లులతోపాటు ఎఫ్​సీఐ, ఇతర గిడ్డంగుల్లో నిల్వ ఉంది. ఇప్పటికే నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో కోతలు ప్రారంభం కావడంతో... ఇప్పుడు సేకరించిన పంట ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. గతేడాది వానాకాలం, యాసంగి సీజన్​వి కలిపి విభాజ్య నల్గొండ జిల్లాకు చెందినవే... 10 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయి. ఇప్పుడు ఆ ధాన్యాన్ని తరలిస్తే కానీ... మిగతా పంటను సర్దుబాటు చేయలేని పరిస్థితి. గతేడాది కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయానికి సంబంధించి ఎఫ్​సీఐ నిర్ణయంతో... మిల్లర్ల నుంచి సేకరించే బియ్యం ఆలస్యమైంది. అందువల్లే ఇప్పటివరకు ఆ బియ్యాన్నిసేకరిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కొనుగోలు చేసే ధాన్యం ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

నల్గొండ జిల్లాలో 4,53,752 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా... 11,02,875 మెట్రిక్ టన్నుల దిగుబడులుంటాయని అంచనా వేశారు. అందులో 5 లక్షల 43 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించగా... 280 వరకు కేంద్రాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో 4,69,517 ఎకరాల్లో పంటలు వేయగా... 11,26,848 మెట్రిక్ టన్నుల దిగుబడులుంటాయని అంచనా వేశారు. 4,12,244 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించగా... 247 కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,68,221 ఎకరాల్లో సాగు విస్తీర్ణానికిగాను... 5,08,472 మెట్రిక్ టన్నుల దిగుబడులుంటాయని అంచనా. అందులో 2,25,487 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించగా... 120 వరకు కేంద్రాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.