ETV Bharat / state

ముగిసిన నోముల ప్రస్థానం.. రేపు అంత్యక్రియలు - నల్గొండ జిల్లా వార్తలు

తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంతోపాటు ఆయన స్వస్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మూడున్నర దశాబ్దాలపాటు రాజకీయంలో అలుపెరగని నేతగా పేరొందిన ఆయన... ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. తమ అభిమాన నేతను కడసారి చూసి... జిల్లా ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. నోముల స్వస్థలంలో గురువారం.. అంత్యక్రియలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

NOMULA
ముగిసిన నోముల ప్రస్థానం.. రేపు అంత్యక్రియలు
author img

By

Published : Dec 2, 2020, 5:38 AM IST

ముప్పై ఏళ్లకుపైగా రాజకీయ జీవితంలో ఎందరో అభిమానాన్ని చూరగొన్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి... ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను కలచి వేసింది. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో బుధవారం ఉదయం నోముల కన్నుమూశారు. భౌతికకాయాన్ని కొత్తపేటలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ నుంచి నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాకు తరలించారు. వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి... తమ అభిమాన నేతకు కన్నీటి నివాళులర్పించారు. అనంతరం, తెరాస శ్రేణులు, అభిమానుల విషణ్న వదనాల నడుమ ప్రత్యేక వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపర్చారు.

సీఎం కేసీఆర్​ హాజరు..

నోముల అంత్యక్రియలు గురువారం.. ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెంలో జరగనున్నాయి. వారి కుటుంబానికి చెందిన స్మృతివనంలో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కేసీఆర్​ రాకతో.. మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ రంగనాథ్ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.

నేతల నివాళులు..

నోముల నర్సింహయ్యకు వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కవితతో పాటు వామపక్షాల నేతల ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఇవీచూడండి: నోముల నర్సింహయ్య కన్నుమూత... ప్రముఖుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.