ETV Bharat / state

పాసుపుస్తకాలు ఇంకా రాలేదేం? - తెలంగాణ రైతులు

ఉమ్మడి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరుకు చెందిన సుధారాణి తండ్రి నుంచి కొంత భూమిని గతేడాది డిసెంబరు 7న గిఫ్ట్‌ డీడ్‌ చేసుకున్నారు. మరికొంత భూమిని బాబాయి నుంచి కొన్నారు. ఆమెకు ఇప్పటికీ పాసుపుస్తకం అందలేదు.

new-pattadar-passbook-issues-in-telangana
పాసుపుస్తకాలు ఇంకా రాలేదేం?
author img

By

Published : Mar 29, 2021, 7:54 AM IST

గతేడాది నవంబరు 2 నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లు, భాగ పంపిణీ, వారసత్వ బదిలీ, జీపీఏ, గిఫ్ట్‌ డీడ్‌, పెండింగ్‌ మ్యుటేషన్లు ఇతర సేవలన్నీ పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో తహసీల్దారు కార్యాలయంలో వెంటనే యాజమాన్య హక్కు నకలు పత్రాన్ని అందజేస్తున్నారు.

భూసంబంధిత వ్యవహారాల్లో తహసీల్దారు కార్యాలయం ప్రమేయాన్ని నివారించే ఉద్దేశంతో పాసుపుస్తకాలను ప్రభుత్వం పోస్టు/కొరియర్‌ ద్వారా అందజేస్తోంది. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయ్యాక ధరణి పోర్టల్‌ ద్వారా సంబంధిత సమాచారం చెన్నైలోని పాసుపుస్తకాల ముద్రణ కేంద్రానికి చేరుతుంది. అక్కడి నుంచే నేరుగా రైతులకే బట్వాడా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన నెలన్నరలోపే పాసుపుస్తకాలు వస్తున్నాయి. కొందరికి మాత్రం జాప్యం చోటుచేసుకుంటోంది. పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నామే కానీ... పాసుపుస్తకాలు మాత్రం చేతికందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకు కొరియర్‌ వ్యవస్థ మాదిరిగా ట్రాకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: మూడు రోజుల పాటు సహజ సేంద్రియ ఉత్పత్తుల మేళా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.