ఆత్మరక్షణకు కరాటే, జూడో ఎంతో ఉపయోగపడుతాయని జూడో సంఘం రాష్ట్ర కోశాధికారి పి. బాలరాజు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్యసమాజ్‌లో 14, 17, 19 ఏళ్ల లోపు కేటగిరిలో బాలబాలికల జాతీయ స్థాయి పోటీలు ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడాపోటీలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి సమాజంలో గుర్తింపు పొందాలని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర భాజపాలో నూతన అధ్యాయం'