ETV Bharat / state

'అనుమతి పత్రాలు ఇచ్చాకే ఏపీకి పంపండి' - LOCK DOWN UPDATES

తెలంగాణ చెక్​పోస్టులు అనుమతించినా.... ఏపీ అధికారులు తిప్పి పంపిస్తున్న దృష్ట్యా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్టును ఎస్పీ రంగనాథ్​ పరిశీలించారు. వైద్యులకు, పోలీసులకు పలు సూచనలిచ్చారు.

NALGONDA SP RANGANATH VISITED VADAPALLI CHECHPOST
'అనుమతి పత్రాలు ఇచ్చాకే ఏపీకి పంపండి'
author img

By

Published : May 2, 2020, 7:50 PM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద నెలకొన్న పరిస్థితులను ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా... కొంతమంది ఆంధ్రా వాసులు తమ సొంత వాహనాలలో వాడపల్లి చెక్​పోస్ట్ వద్దకు చేరుకున్నారు.

తెలంగాణ అధికారులు అనుమతులు ఇచ్చినా.... ఆంధ్రప్రదేశ్​ చెక్​పోస్ట్ వద్ద వారిని తిప్పి పంపారు. ఈ ఘటన దృష్ట్యా... ఎస్పీ చెక్​పోస్ట్​ను పరిశీలించారు. పోలీస్ వారికి, వైద్య సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చెక్​పోస్టు వద్దకు వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి... అనుమతి పత్రాలు ఇచ్చిన తర్వాతనే ఏపీ పంపాలని అధికారులకు సూచించారు.

ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.