రేపు రాత్రికల్లా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వస్తాయని ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కడతారని చెప్పారు. 8 గంటల తర్వాత లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు రేపు ఉదయంకల్లా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.
లెక్కింపు కేంద్రాల వద్దకు అభ్యర్థులు వచ్చి పరిశీలిస్తున్నారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఉటుంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ విధించారు.
ఇదీ చదవండి: పారిపోయేందుకు యత్నించి.. కిటికీలో ఇరుక్కొని..