నాగార్జునసాగర్ జలాశయంకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 క్రస్ట్ గేట్ల(nagarjunasagar dam gates)ను ఐదు అడుగుల మేర ఎత్తి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి 67 వేల 281 క్యూసెక్కులు వస్తుండగా... రెండు గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 32 వేల క్యూసెక్కులు, 16 వేల క్యూసెక్కుల నీరు కుడి, ఎడమ కాలువలకు సాగు నీరు, ఏఎమ్మార్పీ కాల్వకు 2400 క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా వెళ్తోంది.
సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలకు చేరింది. ఆగస్టు 1నుంచి 14 రోజుల పాటు సాగర్ జలాశయం క్రస్ట్ గేట్ల(nagarjunasagar dam gates)ను ఎత్తి వరదను దిగువకు విడుదల చేశారు. అనంతరం సెప్టెంబర్ 17 న 12 గేట్లు ఎత్తిన నీటికి దిగువకు విడుదల చేశారు. ఈ సీజన్లో మరొకసారి ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు. వచ్చే వరదను బట్టి క్రస్ట్ గేట్లని ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు 50 వేల 821 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... నాలుగు గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని విడిచిపెడుతున్నారు. 45.77 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను.. 33.18 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు.
ఇదీ చూడండి: