ETV Bharat / state

ఒక్కో ప్రాజెక్టుదీ ఒక్కో కథ.. ప్రశ్నార్థకంగా జలాశయాల భవిష్యత్తు - telangana projects latest news

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాల కారణంగా... ఆయకట్టు తడవకముందే గేట్లు కొట్టుకుపోవడం, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకలేకపోవడం వంటివి జరుగుతున్నాయి. గుత్తేదార్లు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

nagarjunasagar-project-spillway-damaged
ఒక్కో ప్రాజెక్టుదీ ఒక్కో కథ
author img

By

Published : Aug 6, 2021, 6:42 AM IST

నిర్మాణంలో నాణ్యత లోపాలు సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆయకట్టు తడవకముందే గేట్లు కొట్టుకుపోవడం, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోతున్న పరిస్థితులు పలు ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నాయి. గుత్తేదారులు, రాజకీయ నాయకులు, ఇంజినీర్ల కుమ్మక్కు దీనికి ప్రధాన కారణం. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగానే పులిచింతల గేటు పడిపోవడంతో నీటిని సముద్రానికి వదిలేయాల్సిన దుస్థితి. పులిచింతల నిర్మాణంలో నాణ్యతా లోపాలే దీనికి కారణమనే విమర్శలు ఇంజినీరింగ్‌ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన అనేక ప్రాజెక్టులది ఇదే తీరు. నీరొచ్చినా నిల్వ చేయలేక... మళ్లీ రూ. వందల కోట్లతో మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని వెలుగోడు, పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, యోగివేమన, కండలేరు, అన్నమయ్య, తెలంగాణలోని పాలెంవాగు, మూసీ తదితర ప్రాజెక్టుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

  • తెలంగాణలో పాలెంవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది. గుత్తేదారు, ఇంజినీర్లు కలిసి డిజైన్‌లో చేసిన మార్పుల వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడంతో పాటు నిర్మాణానికి రెండింతలు వ్యయం చేయాల్సి వచ్చింది.
  • నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ జలాశయం కుడి కాల్వ గేటు 2020 సెప్టెంబరులో విరిగిపోయింది. దాని నుంచి ఏడు నెలల పాటు నీళ్లు వృథాగా పోయాయి. 2009 నాటి వరదలకు ప్రాజెక్టు స్పిల్‌వేపై గోతులు ఏర్పడ్డాయి. నేటికీ పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. ఇటీవల కూడా ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలో గేట్ల సీళ్లు, ఇనుపతాళ్లకు గ్రీజు లాంటి పనులు చేపట్టడం నిర్లక్ష్యానికి నిదర్శనం.
  • మూసీ ప్రాజెక్టు అయిదో నంబరు గేటు 2019 అక్టోబరులో కొట్టుకుపోయింది. 4.46 టీఎంసీల నీరు వృథా అయ్యింది.
  • వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న సరళాసాగర్‌ ప్రాజెక్టు కట్ట 2019 డిసెంబరులో తెగిపోయింది. ఆసియాలోనే మొదటి ఆటో సైఫన్‌ విధానంలో నిర్మించిన ప్రాజెక్టు ఇది. నీటి మట్టం పెరిగితే గేట్లు వాటంతట అవే తెరుచుకునే వాల్వుల విధానం ఇక్కడ ఉంది. నిర్వహణ సరిగా లేకపోవడంతో కట్ట తెగి 0.45 టీఎంసీల నీళ్లు వృథా అయ్యాయి.
  • నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో ఉన్న కడెం ప్రాజెక్టు రెండో గేటు 2018 సెప్టెంబరులో ఊడిపోయింది. అయిదు టీఎంసీల జలం వృథాగా పోయింది. మరమ్మతులకు రూ.5 కోట్ల వరకు వ్యయం చేశారు.
  • ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జలయజ్ఞంలో నిర్మించిన గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట 2006లో తెగిపోయింది. ప్రాజెక్టు డిజైన్‌ సరిగా లేకపోవడంతో మట్టికట్ట కొట్టుకుపోయింది. రూ.6 కోట్ల అంచనాతో ప్రారంభించగా రీ డిజైన్‌తో 2016లో పూర్తిచేశారు.

ఇదీ చూడండి: pulichinthala: పులిచింతల ఘటన.. నిర్మాణ లోపాలే ప్రధాన కారణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.