నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గింది. ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గడం వల్ల అన్ని క్రస్ట్ గేట్లు మూసివేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 45,619 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 45,619 క్యూసెక్కుల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 311.44 టీఎంసీలుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు... ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది.
నిన్నటి వరకు వరద ప్రవాహాన్ని బట్టి 8 నుంచి 4 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టడంతో 2 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించారు. వరద నీరు తగ్గడం వల్ల ఈరోజు అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ఇన్ ఫ్లోను బట్టి సాగర్ జలాశయం కుడి, ఎడమ కాలువలకు 18 వేల క్యూసెక్కుల నీరు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 24 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: త్రివేణి జల సవ్వడులతో... జిల్లాలో పచ్చని పంటలు