ETV Bharat / state

Nagarjuna sagar: సాగర్ టు శ్రీశైలం లాంచీ సేవలు రద్దు.. ఎందుకంటే!

నేటి నుంచి ప్రారంభం కావాల్సిన నాగార్జున సాగర్(nagarjuna sagar)-శ్రీశైలం(srisailam) లాంచీ సేవలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వీసులను వాయిదా వేసి వచ్చే నెల 4 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ నిండుకుండలా మారడంతో పర్యాటకులు ఈ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

nagarjuna sagar to srisailam, sagar launch services
సాగర్ టూ శ్రీశైలం లాంచీ సేవలు, నాగార్జునసాగర్ లాంచీ సేవలు
author img

By

Published : Aug 28, 2021, 11:06 AM IST

నాగార్జునసాగర్(nagarjuna sagar) జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు లాంచీ ప్రయాణ సేవలను నేటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. సాగర్ నుంచి శ్రీశైలానికి(srisailam) జలయాత్ర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి... అనివార్య కారణాల వల్ల రద్దు చేశారు. వచ్చే నెల 4నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి ప్రతి శనివారం ఈ జలయాత్ర తప్పనిసరి కాగా... 70 మంది ప్రయాణికులు ఉంటే ఏరోజైనా లాంచీ నడిపే అవకాశం ఉంది.

హైదరాబాద్-నాగార్జున సాగర్- శ్రీశైలం:

హైదరాబాద్ నుంచి వచ్చే వారికోసం ప్రతి శనివారం బస్సు ఉదయం 6గంటలకు బయలుదేరి 9 గంటల వరకు సాగర్‌కు చేరుకుంటుంది. అక్కడ అల్పాహారం అనంతరం లాంచీ శ్రీశైలానికి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. అక్కడ రాత్రి భోజనం, బస ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఉదయం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దర్శనం అనంతరం తిరిగి లాంచీ ద్వారా బయల్దేరుతారు.

హైదరాబాద్‌-సాగర్-శ్రీశైలం ప్యాకేజీ వివరాలు...

  • పెద్దలు: రూ.3,999
  • పిల్లలు: రూ.3,200

సాగర్‌ టు శ్రీశైలం(ఒకేసారి):

  • పెద్దలు: రూ.1,499
  • పిల్లలు: రూ.1,199

సాగర్‌ టు శ్రీశైలం+ శ్రీశైలం టు సాగర్

  • పెద్దలు: రూ.2,499
  • పిల్లలు: రూ.1999

టికెట్ వివరాలను తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ వెబ్ సైట్‌లో పొందుపర్చారు.

ఇదీ చదవండి: Double Bedroom Houses: 'నిధుల్లేవ్.. ఇంకా రూ.11 వేల కోట్లు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.